Sunday, March 29, 2020

సత్యభామ......

.ఎటు చూసినా అల్లకల్లోలం గా ఉంది...క్వారంటైన్ అవ్వడం కొత్తగానే ఉన్నట్లుంది...

నా వ్యక్తిగత కారణాల వల్ల నేను అక్టోబర్ నుండీ "లాక్ డవున్" లోనే ఉన్నా...ధైర్యం చిక్కబట్టుకుని ఈ "గత్తర "తొలిగిపోవాలని ఎదురు చూస్తున్నా...ఒక్క మా కవుంటీ లోనే ఐదొందల పై చిలుకు పాజిటివ్ లున్నయి...చుట్టూ చూస్తూ అందరినీ చదువుతూ ఏమనాలో అర్ధం కాని అయోమయం...అంతే...

ఏంటో చాలా రోజులైంది ఇటు వచ్చి అసలు ఒకప్పుడు బ్లాగ్ రాసానన్న విషయమే మర్చిపోయా....మరలా కొత్తగా మొదలుపెట్టినట్లే ఉంది..పబ్లిష్ చెయ్యని డ్రాఫ్టులు కూడా కొన్ని ఉన్నై...సరే అని ముందస్తుగా...
ఈ టపా ....
*****************************************************************

ఈ టపా  ఏ ఉద్దేశంతో రాసినట్టూ? అంటే సమాధానం రెండు రకాలుగా చెప్పవచ్చు..........


ఒకటి తోచీతోచనమ్మ తోడికోడలి పుట్టిల్లు....సామెత

రెండు దానే దానే పె ఖానె వాలేకీ నాం.....లగా చదివే పుస్తకాలు కూడా చదువరి అద్రుష్టం అనుకోవాలేమో...

ప్రత్యేకంగా సత్యభామ గురించి ఏమీ లేదు. అంతా చిన్నప్పటినుండీ మనం విన్నవే.

కధ మొదలే కృష్టుడు, బలరాముడు మరణించడం రాణీవాసం మొత్తాన్ని అర్జునుడు రధాల్లో హస్తినకు తరలించుకుపోవడం వెనుకనుంచి సాగరం ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ద్వారకను తనలో కలిపేసుకోవడం తో మొదలవుతుంది.

దుఃఖ పడుతూనే కృష్ణుడు లేడనే నిజాన్ని నమ్మలేక తన శక్తిని తాను విపరీతంగా నమ్మి దారిలో దొంగల చేతిలొ భంగపడతాడు.అతి కష్టమ్మీద అష్ట రాణులనూ రక్షించుకోగలుగుతాడు కానీ మిగిలిన వారిని దోపిడీదారులు కొల్ల గొట్టుకుని పోతుంటే నిస్సహాయంగా గాండీవాన్నీ,పనికిమాలి పోయిన దివ్యాస్త్రాల్నీ చూస్తూ విచారంగా హస్తిన చేరతాడు.

జరిగినదంతా తెల్సీ రుక్మిణి తో సహా సత్యను మినహాయించి అగ్నిపవేశం చేస్తారు.సత్య తపస్సుకు వెళుతుంది. ఆ తపస్సులొ నల్లనయ్య తో తన జీవితం ఎలా ముడి పడిందో గుర్తుకొస్తుంది.

ఆనోటా ఈనోటావిని నందనందనుణ్ణి మనసులోనే ఆరాధించడం మొదలు పెడుతుంది. కంసుడి పీడ తప్పుకునేందుకై ఎంతమంది బంధువులు శరణు జొచ్చారో అందరినీ ఆ తరువాత తనతో ద్వారకకు తెచ్చాడు నల్లనయ్య. ఈ నవల్లో ముఖ్యంగా నాకర్ధమైనంతవరకూ సత్య యాదవుల పిల్ల కనుక,ఆమెకు అంత ఆదరం దక్కిందని చెప్పడం రచయత ఉద్దేశ్యం అనుకున్నా.

శ్యమంతకమణి నుంచీ పెళ్ళి దాకా మొన్న వినాయక చవితికి చదువుకున్న కధా, ఈటీవీ భాగవతం సరిపోతాయి.సేం రిపిటీషను ఇక్కడ కూడా.

కాకుంటే రుక్మిణి రాచకన్నె కనుక క్షత్రియులకూ యాదవులకూ మధ్య కక్షలూ, రాజకీయాలూ తగవులూ అన్నీ ఉన్నాయి.బలరామునితో సహా అందరూ సత్య ను రాచకార్యాల్లోకి ఆహ్వానించారని రచయిత అభిప్రాయ పడ్డట్లు
అనిపించింది.

నరకాసురవధ, ఇక్కడే సత్య భూదేవి అంశ అని వధానంతరం తెలియ చేస్తారు.

పారిజాతాపహరణం,తులాభారం ఐతే ఇక్కడ రుక్మిణి తులసాకు ప్రస్తావన లేదు.సుభద్ర అర్జునుల వివాహం, ద్రౌపది వస్త్రాపహరణం పాండవుల అరణ్యవాసం, సత్యా ద్రౌపదుల చర్చలూ చెలిమి, దుర్యోధన కుమార్తెను జాంబవతి కుమారునికిచ్చి నానా గొడవల మధ్య పెండ్లి చెయ్యడం,సంగ్రామం,రాజసూయ యాగం అన్నీ వరసలో వస్తాయి.

పౌండ్రక వాసుదేవుడు కూడా ఉంటాడు కధలో.

ఒక్కో భార్య ద్వారా పదేసిమంది కుమారులు వాసుదేవునికి కలిగారన్నదే ఇక్కడ కొత్త విషయం (నాకు).

జరాసంధుని వధ తరువాత నల్లనయ్యకూ, పాండవులకూ ఎదురులేకపోవడం ,సుభద్ర అర్జునుల వివాహం, పాండవులకు సార్వభవుమాధికారం తద్వారా యాదవులు బలపడుతున్నారని రుక్మిణి తన కుమారునుకి అన్న కూతురినిచ్చి పెండ్లి చేయడం, మరలా మనుమణ్ణి కూడా పుట్టింటి సంబంధానికి పురమాయించడం కొత్త విషయం.
వివాహ సందర్భంగా జరిగిన గొడవలో దాదాపు వంశ క్షయం చూసి రుక్మిణి హడలిపోవడం,కృష్ణుడు మౌనంగా ఉండటం తో మరింత కలతపడతం, బలపడుతున్న యాదవ రాజ్యం చూసి సత్య సంతోషించడం జరుగుతుంది.


యుధిష్టురిడి అశ్వమేధ యాగానికెళ్ళి అనాసక్తిగా పాల్గొని తనతదనంతరం ద్వారకనూ ఆడువారినీ రక్షించాలిసిన బాధ్యత సవ్యసాచిదేనని చెప్పి తిరుగుముఖం పట్టిన కృష్టుణ్ణి అయోమయంగా చూస్తాడు పార్ధుడు.

మధ్యలో ఉత్తరాభిమన్యుల కుమారుడు పరీక్షిత్తుని బ్రతికిస్తాడు
కృష్టుడు. అదే సందర్భంలో మరి ద్రౌపదీ పుత్రులనెందుకు రక్షించలేదన్న ప్రశ్న వస్తుంది కృష్టుడికి. సమాధానం లేదు.

శాప ప్రభావాన తాగి యాదవులూ తత్కాల క్రోధంతో కృష్టుడూ యాదవజాతిని అంతం చేస్తారు. అప్పటికే బలరాముడు తపస్సుకుపోయి మరణిస్తాడు. అర్జునకు కబురందేసరికి బోయవాని చేతిలో కృష్ణ నిర్యాణం ఐపోతుంది.

నీటి వాలున కొట్టుకొచ్చిన శవాల గురించి హస్తిన చేరిన తరువాత చెపుతాడు విజయుడు.

కల లాంటి ఒక అలౌకిక అచేతనావస్తలో ఇవ్వన్నీ గుర్తుకురాగా మాధవుని మరణం ద్వారా సంభవించి దుఃఖం లోంచీ ఒక అనిర్వచనీయమైన మురళీగానం నీలిమబ్బులాగా సత్యభామ ఆత్మను శరీరం నుంచి వేరు చేస్తుంది.









9 comments:

కృష్ణప్రియ said...

నేనూ చదివాను ఈ పుస్తకం. ఈ పుస్తకం లో కొన్ని విషయాలు ఆసక్తి కరం గా అనిపించాయి. ఆధారాలేంటో చెప్తే బాగుండేది అనిపించింది. ఓవర్ ఆల్ గా 'జస్ట్ ఓకే'

రసజ్ఞ said...

సూక్ష్మంలో మోక్షం లాగా బాగా చెప్పారు!

కొత్త పాళీ said...

Is this a book?

sunita said...

@ కృష్ణప్రియ ---మీరు చదివారా! నేను కూడా కొత్త విషయాలేమన్నా ఉన్నాయేమో అని చదివాను. అరాకొరాగా మించి తెలియనివి ఏమీ లేవు.

@రసఙ్ఞ...... నేను కాదండీ అలా చెప్పింది.ఆపుస్తకం రాసిన రచయత.

@కొత్తపాళీ....అవునండీ!"సత్యభామ" అని పుస్తకమే!

మురళి said...

యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాసిందే కదండీ.. ఈసారి ఏం అవార్డు వస్తుందో మరి :-)

నేస్తం said...

మహాభారతంలో యుద్ధానంతరం ఏం జరిగిందో నాకు తెలియదు ..ఏంటో వింటుంటేనే ఓ మాదిరి ఉంది సునీతగారు..ఇండియావెళ్ళాకా ఒక్కో బుక్కు చదవాలి

రాజ్ కుమార్ said...

భారతం సినిమాల్లో మాత్రమే చూసి తెలుసుకున్న నాలాంటోళ్ళు చదవవచ్చంటారా ఈ పుస్తకం? ;)

sunita said...

@ నేస్తం---చదవండి నేస్తం.కృష్ణ నిర్యాణం తరువాత కొద్దికాలానికే పాండవులు (ఇక్కడ కొద్దికాలం అంటే భారతం లెక్కల్లో ఎంతో నాకూ తెలీదు)ద్రౌపతీ సమేతంగా స్వర్గారోహణ చేస్తారు.

@రాజ్ కుమార్---చక్కగా చదవొచ్చు!చదవండి.

sunita said...

@ మురళి...ఈసారి అవార్డ్ రాదేమోనండి.ఒక్కటన్నా కొత్త విషయం లేదు మరి. అన్నీ మనకు తెలిసినవే.